Homeసినిమా వార్తలుPushpa 2 will be Boxoffice Sensation 'పుష్ప - 2' బాక్సాఫీస్ పెను సంచలనం...

Pushpa 2 will be Boxoffice Sensation ‘పుష్ప – 2’ బాక్సాఫీస్ పెను సంచలనం ఖాయం : దేవిశ్రీప్రసాద్

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 ది రూల్. ఈ మూవీ పై ప్రారంభం నాటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. 

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తుండగా ఇతర కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, ఫహాద్ ఫాసిల్, సునీల్, అనసూయ, జగపతి బాబు, రావు రమేష్ కనిపించనున్నారు. ఇటీవల ఫస్ట్ హాఫ్ మొత్తం సిద్దమైన ఈ మూవీ యొక్క సెకండ్ హాఫ్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. కాగా పుష్ప 2 మూవీని డిసెంబర్ 6న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. 

విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ గురించి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఒక ఈవెంట్ లో భాగంగా మాట్లాడుతూ, ఫస్ట్ పుష్ప 2 స్టోరీలోని ఫస్ట్ హాఫ్ ని సుకుమార్ గారు నాకు, చంద్రబోస్ గారికి చెప్పినపుడు అందులో మూడు ఎపిసోడ్స్ ఎంతో అద్భుతంగా అనిపించాయని, అదే సెకండ్ హాఫ్ ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చని తెలిపారు. మొత్తంగా అయితే భారీ స్థాయిలో రూపొందుతోన్న పుష్ప 2 రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ సంచలనం ఖాయం అని అన్నారు.

READ  Game Changer Continuous Updates 'గేమ్ ఛేంజర్' : వరుస అప్ డేట్స్ కి టైం ఫిక్స్ 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories