Homeసినిమా వార్తలుPushpa 2 ticket price 1000 'పుష్ప 2' టికెట్ రేట్ రూ. 1000

Pushpa 2 ticket price 1000 ‘పుష్ప 2’ టికెట్ రేట్ రూ. 1000

- Advertisement -

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన్న హీరోయిన్ గా మైత్రి మూవీ మేకర్స్ పై తాజాగా తెరకెక్కిన మాస్ యాక్షన్ మూవీ పుష్ప 2. ఈ మూవీపై ప్రారంభం నుంచి అందరిలో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ తో పాటు థియేటర్ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుని అందరిలో మూవీ పై భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచాయి. పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న గ్రాండ్ గా విడుదల కానుంది. విషయం ఏమిటంటే పుష్ప 2 మూవీ యొక్క ప్రీమియర్స్ ని డిసెంబర్ 4న రాత్రి 9:30 నుంచి ప్రదర్శించనున్నారు.

ఆంధ్ర, తెలంగాణలో దీనికి భారీ స్థాయిలో అయితే క్రేజ్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఇక ఆంధ్రలో ఈ స్పెషల్ షోస్ టికెట్ ధరని అధికారికంగా రూ.1000 గా నిర్ణయించారు. ఎప్పటినుంచో అందరిలో భారీ స్థాయిలో క్రేజ్ కలిగిన సీక్వెల్ అయిన పుష్ప 2 ఏ స్థాయిలో ప్రీమియర్స్ రెస్పాన్స్ ని సంపాదించుకుంటుందో తెలియాలంటే మరొక నాలుగు రోజులు వెయిట్ చేయకతప్పదు

READ  Bollywood Beauty Fixed in Pushpa 2 song 'పుష్ప - 2'  స్పెషల్ సాంగ్ లో ఆ బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్ ?

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories