Homeపవన్ ఫ్యాన్స్ ఆశలన్నీ వీరమల్లు పైనే ?
Array

పవన్ ఫ్యాన్స్ ఆశలన్నీ వీరమల్లు పైనే ?

- Advertisement -

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మొత్తంగా మూడు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అవి సుజీత్ తీస్తున్న ఓజి, క్రిష్ మరియు జ్యోతి కృష్ణ తీస్తున్న హరి హర వీర మల్లు, అలానే హరీష్ శంకర్ తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూడు సినిమాల పై పవన్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా బాగానే అంచనాలు ఉన్నాయి.

కాగా ప్రస్తుతం ఆంధ్ర డిసిఎం గా బాధ్యతలతో ఎంతో బిజీగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్, ఈ సినిమాలకు సంబంధించి కొంత మేర షూటింగ్ పూర్తి చేసారు. కాగా వీటి యొక్క బ్యాలెన్స్ షూట్ ని ఆయన త్వరలో పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక వీటిలో ముందుగా హరి హర వీర మల్లు మూవీ సమ్మర్ కానుకగా మే 9 న గ్రాండ్ గ విడుదల కానుంది.

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్. తాజాగా ఈ మూవీ నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ బాగానే రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి రీమేక్ ల అనంతరం తమ అభిమాన హీరో పవన్ నుండి వస్తున్న మూవీ కావడంతో ఆయన ఫ్యాన్స్ దీని పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

READ  'హరి హర వీరమల్లు' డబ్బింగ్ స్టార్ట్స్ 

హిస్టారికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ విజయం ఖాయం అని నిర్మాత రత్నంతో పాటు హరి హర వీర మల్లు టీమ్ మొత్తం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరి ఇది ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో తెలియాలి అంటే మరొక నెల వెయిట్ చేయాలి. 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories