Homeసినిమా వార్తలుKabzaa: ఇండియన్ సినిమాల్లో మునుపెన్నడూ లేని విధంగా నకిలీ కలెక్షన్ల ప్రకటన - 100 కోట్ల...

Kabzaa: ఇండియన్ సినిమాల్లో మునుపెన్నడూ లేని విధంగా నకిలీ కలెక్షన్ల ప్రకటన – 100 కోట్ల పోస్టర్ రిలీజ్ చేసిన కబ్జా టీం

- Advertisement -

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ప్రధాన పాత్రలో.. మరో కన్నడ స్టార్ హీరో సుదీప్ ముఖ్య అతిథి పాత్రలో నటించిన కబ్జా చిత్రం పేలవమైన సమీక్షలు, బలహీనమైన అడ్వాన్స్ బుకింగ్స్ మధ్య ఈ శుక్రవారం విడుదలైంది. కాగా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు ప్రేక్షకుల నుండి విరుద్ధమైన స్పందన వచ్చింది మరియు అన్ని చోట్లా బలహీనమైన ఆక్యుపెన్సీ కనిపించింది.

అలా ఒక పక్క ఈ సినిమా అన్ని చోట్లా తిరస్కరణకు గురై థియేటర్లు ఖాళీగా దర్శనం ఇస్తుండగా.. నిర్మాతలు మాత్రం ఈ సినిమాను ఎలాగైనా విజయవంతమైన సినిమా అని రుజువు చేయాలని తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

పబ్లిసిటీ కోసం, రికార్డుల కోసం కలెక్షన్లను వచ్చిన వాటి కంటే ఎక్కువగా చూపించడం ప్రతి ఇండస్ట్రీలోనూ సర్వసాధారణం. కలెక్షన్ లెక్కలను 20%-30% పెంచడం సాధారణంగా కొంతమంది నిర్మాతలు చేస్తారు. కానీ ఇప్పుడు కబ్జా టీం ఏకంగా దాదాపు 500 శాతం కలెక్షన్లు ఎక్కువ చూపించి అందరినీ షాక్ కి గురి చేసింది! అంతే కాకుండా ఆ పోస్టర్లపై ‘కన్నడ పరిశ్రమకు మరో గర్వకారణం’ అని చిత్ర బృందం ముద్రించటం విడ్డూరం.

READ  Custody: కస్టడీ నుంచి విడుదలయిన హీరో నాగ చైతన్య

రెండు రోజులకు కబ్జా సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం 20 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. అయితే అందరికీ షాక్ ఇచ్చిన చిత్ర బృందం ఏకంగా100 కోట్ల పోస్టర్ ను విడుదల చేసింది. ఇతర భాషల నుంచి కబ్జా వసూళ్లు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. టాప్ స్టార్స్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా చూడటం కోసం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో స్టార్ కాస్ట్ కూడా విఫలమైంది. శ్రియ, శివరాజ్ కుమార్ వంటి స్టార్లు నటించిన ఈ పాన్ ఇండియా చిత్రం బాక్సాఫీస్ వద్ద కనీస స్థాయిలో కూడా ప్రభావం చూపలేకపోయింది.

Follow on Google News Follow on Whatsapp

READ  Bimbisara: బింబిసార దర్శకుడు, కళ్యాణ్ రామ్ మధ్య విభేదాలు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories