Homeసినిమా వార్తలునెట్ ఫ్లిక్స్ లో సికందర్, రెట్రో ని బీట్ చేసి దూసుకెళ్తున్న ​'హిట్ - 3'

నెట్ ఫ్లిక్స్ లో సికందర్, రెట్రో ని బీట్ చేసి దూసుకెళ్తున్న ​’హిట్ – 3′

- Advertisement -

నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ఇటీవల శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ హిట్ 3. ఈ మూవీలో ప్రతీక్ బబ్బర్ విలన్ గా నటించగా ఇతర ముఖ్య పాత్రల్లో రావు రమేష్, కోమలి ప్రసాద్, సముద్ర ఖని, సూర్య శ్రీనివాస్ తదితరులు నటించారు.

వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ సంస్థలు గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకుంది. తాజాగా ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా పలు భాషల్లో అందుబాటులోకి వచ్చిన హిట్ 3 మూవీ మంచి వ్యూస్ తో ప్రస్తుతం దూసుకుపోతోంది.

ముఖ్యంగా బాలీవుడ్ కండల వీరు సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ తో పాటు సూర్య హీరోగా తెరకెక్కిన రెట్రో మూవీ ఓటిటి వ్యూస్ ని దాటేసి ఇది ప్రస్తుతం ఆడియన్స్ ని అలరిస్తూ కొనసాగుతోంది. సికందర్ మే 25న ఓటిటి లో విడుదలైంది, హిట్ 3 మే 30 నుండి రెట్రోతో పాటు ప్రసారం అయింది.

READ  'హిట్ - 3' ఓటిటి కి షాకింగ్ రెస్పాన్స్ 

సికందర్ దాదాపు 5.1 మిలియన్ల వ్యూస్ ని సంపాదించి ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లేతర చిత్రాల విభాగంలో 3వ స్థానంలో నిలిచింది. నెట్‌ఫ్లిక్స్‌లో 9 దేశాలలో టాప్ 10 జాబితాలో కూడా ఇది ట్రెండ్ అయింది. హిట్ 3, 4.2 మిలియన్ల వ్యూస్ ని పొందింది మరియు ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లేతర చిత్రాల విభాగంలో 4వ స్థానంలో నిలిచింది.

ఇది 14 దేశాలలో టాప్ 10 జాబితాలో నిలిచింది. మరోవైపు, రెట్రో దాదాపు 2.5 మిలియన్ల వ్యూస్ ని సంపాదించి ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లేతర చిత్రాల విభాగంలో 7వ స్థానంలో నిలిచింది. ఇది 13 దేశాలలో టాప్ 10 జాబితాలో కూడా ట్రెండ్ అయింది. ఈ విధంగా మొత్తంగా నాని నటించిన హిట్ 3 ఆ రెండు సినిమాలని డామినేట్ చేసి నెట్ ఫ్లిక్స్ లో దూసుకెళ్తుండడం విశేషంగా చెప్పుకోవాలి.

Follow on Google News Follow on Whatsapp

READ  ఈ ఏడాది పవన్ ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజా ఫిక్స్ ?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories