HomeMovie News'కన్నప్ప' మూవీ చూసిన మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

‘కన్నప్ప’ మూవీ చూసిన మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

- Advertisement -

మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా ఫాంటసీ యాక్షన్ డివోషనల్ ఎంటర్టైనర్ సినిమా కన్నప్ప. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ బాబు, బ్రహ్మానందం, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

అందరిలో మంచి అంచనాలు ఏర్పరచిన ఈ సినిమా నేడు ఆడియన్స్ ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ అందుకుంది. ఏవిఏ ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫిలిమ్ ఫ్యాక్టరీ సంస్థల పై మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా దాదాపుగా రూ. 200 కోట్లకు పైగా భారీ వ్యయంతో నిర్మితం అయిన ఈ మూవీకి స్టీఫెన్ దేవసి సంగీతం సమకూర్చారు.

అయితే విషయం ఏమిటంటే, నేడు ఈ మూవీ ప్రత్యేకంగా వీక్షించిన మంచు మనోజ్ మాట్లాడుతూ, తాను భావించిన దానికంటే సినిమా 1000 రెట్లు ఎంతో నచ్చిందని అన్నారు. చివరి 30 నిముషాలు అన్నయ్య విష్ణు యాక్టింగ్ ఎంతో బాగుందని, అలానే ప్రభాస్ క్యామియో పాత్ర సినిమాకి పెద్ద ప్లస్ అని తెలిపారు. మొత్తంగా తన తండ్రి మంచు మోహన్ బాబు సహా కన్నప్ప టీమ్ కి ప్రత్యేకంగా విజయాభినందనలని తెలియచేసారు మనోజ్. మరి మొత్తంగా రేపటి నుండి కన్నప్ప ఎంతమేర బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp

See also  'స్పిరిట్' : త్రిప్తి డిమ్రి పై ప్రభాస్ ఫ్యాన్స్ రెస్పాన్స్ ఇదే


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories