Homeసినిమా వార్తలుMalayalis Criticism on Fahad Faasil for Pushpa 2 ఫహాద్ ఫాసిల్ పై విమర్శలు...

Malayalis Criticism on Fahad Faasil for Pushpa 2 ఫహాద్ ఫాసిల్ పై విమర్శలు ఎక్కుపెడుతున్న మలయాళీలు

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 మొన్న గ్రాండ్ లెవెల్ లో వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకు వచ్చింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీని సుకుమార్ తెరకెక్కించగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇక ఈ మూవీలో నెగటివ్ రోల్ లో మలయాళ నటుడు ఫహాద్ ఫాసిల్ నటించారు.

ఇటీవల ఆవేశం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఫహాద్ ఇందులో బన్వర్ సింగ్ షకావత్ పాత్రలో తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు. ఇక పుష్ప 2 తో పాటు ఇటీవల వచ్చిన విక్రం, మామన్నన్, వేట్టయాన్ సినిమాల్లో కూడా ఆయన మంచి పాత్రలు చేశారు. వాటన్నిటికీ కూడా మంచి పేరు వచ్చింది. అయితే విషయం ఏమిటంటే పుష్ప 2 లోని ఇంటర్వెల్ ఎపిసోడ్ సీన్స్ లో ఫహాద్ పాత్రకు సంబంధించి మలయాళీల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ తో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి.

అలానే ఫహాద్ కూడా ఆ సీన్ షూటింగ్ సమయంలో ఒకింత ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యారని అందుకే ఆయన పుష్ప 2 కు సంబంధించిన ఏ ఈవెంట్ కి ముఖ్యంగా కేరళ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా హాజరు కాలేదని తెలుస్తోంది.

READ  Game Changer Pre Release Event in USA 'గేమ్ ఛేంజర్' : యుఎస్ఏ లో ప్రీ రిలీజ్ ఈవెంట్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories