HomeMovie News'ఖలేజా' రీ రిలీజ్ : డిజప్పాయింట్ అయిన మహేష్ ఫ్యాన్స్

‘ఖలేజా’ రీ రిలీజ్ : డిజప్పాయింట్ అయిన మహేష్ ఫ్యాన్స్

- Advertisement -

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అందాల నటి అనుష్క శెట్టి హీరోయిన్ గా మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఖలేజా మూవీ సరిగ్గా 15 ఏళ్ల క్రితం రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయింది.  ఇక తాజాగా సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ జన్మదినం సందర్భంగా ఈ సినిమాని 4కె వర్షన్ థియేటర్స్ లో రీరిలీజ్ చేసేందుకు సిద్ధమైంది టీం.

నిన్నటి నుంచి ఈ సినిమాకు ప్రీమియర్స్ ని పలు ప్రాంతాల్లో ప్రదర్శించగా విశేషమైన రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటికే అడ్వాన్స్ సేల్స్ పరంగా ఈ సినిమా రూ.5 కోట్ల మార్క్ ని దాటేసి దూసుకెళ్తోంది.

అయితే నిన్నటి ప్రీమియర్స్ చూసిన ఫ్యాన్స్ కి థియేటర్స్ లో ఒకింత షాక్ తగిలింది. ఖలేజా సినిమాలోని కొన్ని సీన్స్ ని కట్ చేశారని అవి ఎందుకు తొలగించారో తమకు అర్థం కాలేదని పలువురు ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా నేటి నుంచి ఎటువంటి సీన్స్ కట్ అవడం ఉండదని, పూర్తిస్థాయి సినిమాని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయవచ్చని ఖలేజా టీం అధికారికంగా ప్రకటించింది. మరి మొత్తంగా ఈ సినిమా ఎంత మేర కలెక్షన్ రాబడుతుందో చూడాలి. 

See also  'జింఖానా' మూవీ రివ్యూ : సరదాగా సాగె బాక్సింగ్ డ్రామా 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories