Homeసినిమా వార్తలుకుబేర మూవీ రివ్యూ : ఆకట్టుకునే సోషల్ డ్రామా 

కుబేర మూవీ రివ్యూ : ఆకట్టుకునే సోషల్ డ్రామా 

- Advertisement -

సినిమా పేరు: కుబేర

రేటింగ్: 3.25 / 5

తారాగణం: ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న, సునైనా, జిమ్ సర్బ్, దలీప్ తాహిల్ మరియు ఇతరులు

దర్శకుడు: శేఖర్ కమ్ముల

నిర్మాతలు: సునీల్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు

విడుదల తేదీ: 20 జూన్ 2025

అక్కినేని నాగార్జున, ధనుష్ ల కలయికలో శేఖర్ కమ్ముల తీసిన లేటెస్ట్ యాక్షన్ మూవీ  కుబేర. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా దీనిని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి తో కలిసి అమిగోస్ క్రియేషన్స్ సంస్థ పై స్వయంగా శేఖర్ కమ్ముల నిర్మించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ నేడు గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి కుబేర మూవీ యొక్క పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం. 

కథ

ముఖ్యంగా ఈ మూవీ అధిక సంపన్నులు పేదవారి పట్ల ఏవిధంగా వ్యవహరిస్తారు అనే కథనంతో సాగుతుంది. ఇందులో సిబిఐ ఆఫీసర్ దీపక్ (నాగార్జున) అలానే దేవా (ధనుష్) అనే బిచ్చగాడి చుట్టూ తిరుగుతూ అతడు ఏవిధంగా పవర్ఫుల్ వ్యక్తిగా మారాడని చూపుతుంది. 

నటీనటుల పెర్ఫార్మన్స్

ముఖ్యంగా ఈ మూవీలో దీపక్ అనే సిబిఐ అధికారి పాత్రలో నాగార్జున పరకాయ ప్రవేశం చేసారని చెప్పాలి. పలు యాక్షన్ ఎమోషనల్ సీన్స్ లో ఆయన నటన సూపర్ గా ఉంది. దాదాపుగా వంద సినిమాలు చేసిన నాగ్ మరొక్కసారి ఈ మూవీలో అదరగొట్టి అందరినీ అలరించారు. ధనుష్ అయితే ఆ పాత్రలో ఒదిగిపోయారు.

గతంలో మాదిరిగా మరొక్కసారి ధనుష్ సూపర్ పెర్ఫార్మన్స్ ఈ మూవీ లో కూడా చూడవచ్చు. రష్మిక కూడా తన పాత్ర యొక్క పరిధి మేరకు ఆకట్టుకున్నారు. జిమ్ సర్బ్ విపరీతమైన ఆశగల ధనికుడిగా ఆకట్టుకున్నారు. అలానే ఇతర పాత్రల్లో నటించిన సాయాజీ షిండే, దలీప్ తాహిల్ మరియు సునైనా వారి వారి పాత్రల్లో ఒగిడిపోయారు. 

విశ్లేషణ

READ  'హరి హర వీర మల్లు' యుఎస్ఏ ప్రీమియర్స్ : అజ్ఞాతవాసి ని బీట్ చేస్తుందా ?

గతంలో ఎన్నో ఫీల్ గుడ్ మూవీస్ తీసిన శేఖర్ కమ్ముల ఈ మూవీ ద్వారా లక్షల కోట్ల బినామీ స్కాం అంశాన్ని తీసుకుని కుబేర ని తెరకెక్కించారు. కథ పాయింట్ పరంగా సింపుల్ గా అనిపించినా శేఖర్ కమ్ముల మూవీని ఆకట్టుకునే రీతిన తీశారు.

బిచ్చగాళ్ల యొక్క జీవితం, ధనికుల యొక్క మరింత ఆశ, కొందరు బినామీల వ్యవహార శైలి ఇందులో చూపించారు. ఫైనాన్సియల్ ఫ్రాడ్స్ ఎలా జరుగుతాయి అనే అంశాన్ని ఆడియన్స్ కి క్లియర్ గా చూపించారు.

అయితే ప్రీ ఇంటర్వెల్ వరకు సాదాసీదాగా సాగిన మూవీ ఇంటర్వెల్ ఎమోషన్ నుండి సెకండ్ హాఫ్ బాగా సాగుతుంది. దేవా ఎదుర్కొన్న సంఘటనలు, మధ్యలో సిబిఐ అధికారి దీపక్ ఎంట్రీ, వారితో పాటు స్కాం చుట్టూ కథనం ఆసక్తికరంగా సాగుతుంది.

గర్భవతి అయితే అమ్మాయి సీన్స్ తో పాటు పోయిరా పోయిరా మామ సాంగ్ ఎమోషనల్ గా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సినిమాలో ప్రీక్లైమాక్స్ అనేది ప్రధాన బలంగా చెప్పుకోవాలి. నాగార్జున, ధనుష్ పాత్రల చెంజోవర్, బిచ్చగాడు ధనికుడిగా మారడం వంటివి బాగా చూపించారు.

అయితే ఆ సీన్స్ రేసీగా సాగడంతో కొంత ఇంటెన్స్ ఫీల్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఇక గ్రాండియర్ విజువల్స్ తో రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ నేపధ్య సంగీతం కూడా పలు సీన్స్ లో ఎంతో బాగుంటుంది.

ప్లస్ పాయింట్స్

  • ప్రధాన కథ
  • ధనుష్ మరియు నాగార్జునల నటన
  • ఆకట్టుకునే రచన/స్క్రీన్ ప్లే
  • భావోద్వేగ భాగాలు
  • దేవిశ్రీ నేపథ్య సంగీతం
READ  బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీ ఫిక్స్

మైనస్ పాయింట్స్

  • అక్కడక్కడ నిస్తేజమైన దృశ్యాలు
  • కొన్ని లోపాలు
  • సడన్ గా ఫాస్ట్ గా సాగె క్లైమాక్స్‌ 

తీర్పు

మొత్తంగా నాగార్జున, ధనుష్ ల కలయికలో శేఖర్ కమ్ముల తీసిన లేటెస్ట్ మూవీ కుబేర మంచి యాక్షన్ ఎమోషనల్ అంశాలతో ఆకట్టుకుంటుంది. నాగార్జున, ధనుష్ ల నటన ప్రధాన ప్లస్ పాయింట్. అయితే ఫస్ట్ హాఫ్ నెమ్మదించడంతో పాటు క్లైమాక్స్ రేసీ గా అనిపిస్తుంది. ఓవరాల్ గా వీలైతే ఈ వారాంతంలో కుబేర మూవీ మంచి కలెక్షన్ రాబట్టే అవకాశం ఉంది.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories