HomeMovie Newsఓవర్సీస్ రీ రిలీజ్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన 'ఖలేజా'

ఓవర్సీస్ రీ రిలీజ్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ‘ఖలేజా’

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్ గా కనకరత్న మూవీస్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఖలేజా 2010లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఈ మూవీలో రావు రమేష్, ప్రకాష్ రాజ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, ఆలీ వంటి వారు కీలక పాత్రలు చేయగా మెలోడీ బ్రాహ్మణ మణిశర్మ సంగీతం అందించారు.

అయితే తాజాగా మే 30న గ్రాండ్ గా రీ రిలీజ్ ద్వారా మళ్ళి ఆడియన్స్ ముందుకి వచ్చింది ఈ మూవీ. అయితే అంతకముందు రోజు ఖలేజా ప్రీమియర్స్ ప్రదర్శించగా దానికి మంచి క్రేజ్ లభించింది. ఇక ఫస్ట్ డే నుండి బాగా కలెక్షన్స్ అందుకున్న ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా బాగా కలెక్షన్ రాబట్టింది.

విషయం ఏమిటంటే, ఖలేజా మూవీ రీ రిలీజ్ లో ఓవర్సీస్ మార్కెట్ లో 10వేలకు పైగా టికెట్స్ అమ్ముడైన మూవీగా, రూ. 1 కోటి గ్రాస్ అందుకున్న మూవీగా అలానే యుఎస్ఏ లో 100కె డాలర్స్ అందుకున్న మూవీగా సంచలన రికార్డు నమోదు చేసింది.

ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కామెడీ టైమింగ్ కి సూపర్ స్టార్ ఫాన్స్ తో పాటు ఆడియన్స్ అందరూ కూడా థియేటర్స్ లో ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తంగా అప్పుడు ఫ్లాప్ అయిన ఖలేజా మూవీ తాజా రీ రిలీజ్ పరంగా భారీ విజయం దిశగా కొనసాగుతుండడం విశేషం.

See also  ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 'మ్యాడ్ స్క్వేర్' 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories