Homeసినిమా వార్తలుKannappa Teaer Disappoints డిజప్పాయింట్ చేసిన 'కన్నప్ప' టీజర్

Kannappa Teaer Disappoints డిజప్పాయింట్ చేసిన ‘కన్నప్ప’ టీజర్

- Advertisement -

​మంచు విష్ణు హీరోగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏ వి ఏ ఎంటర్టైన్మెంట్స్ సంస్థల పై గ్రాండ్ గా రూపొందుతోన్న లేటెస్ట్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కన్నప్ప. ఈ మూవీలో మోహన్ బాబు, ప్రభాస్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 25న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. 

ఇక ఇటీవల కన్నప్ప నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ పర్వాలేదనిపించగా ఫస్ట్ సాంగ్ మాత్రం బాగానే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఇందులోని పాత్రధారుల పోస్టర్స్ అన్ని కూడా అంతగా ఆకట్టుకోలేదు. అయితే విషయం ఏమిటంటే, నేడు ఈ మూవీ యొక్క టీజర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ముఖ్యంగా టీజర్ లోని అంశాలు అన్ని కూడా అంతగా ఇంట్రెస్టింగ్ గా లేవని చెప్పాలి. అయితే టీజర్ లో ప్రభాస్ లుక్ బాగుంది, ఓవరాల్ గా టీజర్ యావరేజ్ గా ఉందని చెప్పొచ్చు. 

టీజర్ లో సినిమాలోని దాదాపుగా పాత్రధారులు అందరినీ కూడా కొన్ని క్షణాలు చూపించడంతో పాటు విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్కేవలం పర్వాలేదనిపించాయి అంతే. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో యావరేజ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. మరోవైపు సినిమా అద్భుతంగా వస్తోందని టీమ్ చెప్తున్న మాటలకు ఈ ప్రచార చిత్రాలకు పోలిక లేకుండా ఉంది. కాగా ఇందులో మంచు విష్ణు తిన్నడు పాత్ర చేస్తుండగా రుద్రగా ప్రభాస్, మహాశివుడిగా అక్షయ్ కుమార్ కనిపించనున్నారు. మరి రిలీజ్ అనంతరం కన్నప్ప ఎంతమేర విజయం సొంతం చేసుకుంటుందో చూడాలి.

READ  Superstar to Release Robin Hood Second Song 'రాబిన్ హుడ్' సెకండ్ సాంగ్ రిలీజ్ చేయనున్న సూపర్ స్టార్ 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories