Homeసమీక్షలుకన్నప్ప రివ్యూ : యావరేజ్ గా సాగె డివోషనల్ డ్రామా

కన్నప్ప రివ్యూ : యావరేజ్ గా సాగె డివోషనల్ డ్రామా

- Advertisement -

సినిమా పేరు: కన్నప్ప

రేటింగ్: 2.5 / 5

తారాగణం: మంచు విష్ణు, అక్ష కుమార్, ప్రభాస్, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, మోహన్ బాబు, మరియు ఇతరులు

దర్శకుడు: ముఖేష్ కుమార్ సింగ్

నిర్మాత: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు AVA ఎంటర్టైన్మెంట్

విడుదల తేదీ: 27 జూన్ 2025

మంచు విష్ణు, ప్రీతీ ముకుందన్ కలయికలో ముకేశ్ కుమార్ సింగ్ తీసిన లేటెస్ట్ డివోషనల్ మైథలాజి మూవీ కన్నప్ప. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు వంటి నటులు కీలక పాత్రలు చేసిన ఈ మూవీ ఇటీవల టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మంచి అంచనాలు ఏర్పరిచి నేడు గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందనేది ఇప్పుడు పూర్తి రివ్యూలో చూద్దాం.

కథ :

చిన్నప్పటి నుండి దేవుడి పై నమ్మకం లేని గిరిజనుడైన తిన్నడు అనే యువకుడి కథగా ఈ మూవీ సాగుతుంది. కాళహస్తి చరిత్ర తెలుసుకోవడం ద్వారా అతడు శివుడి భక్తుడిగా మారిపోతాడు. ఆ మధ్యలో జరిగిన ఘటనలు, తిన్నడి జీవితం వంటి పలు అంశాల కలయికగా కన్నప్ప మూవీ సాగుతుంది. అయితే పూర్తిగా ఇది తెలుసుకోవాలి అంటే మూవీ తెరపై చూడాల్సిందే.

నటీనటుల పెరఫార్మన్స్ :

ముఖ్యంగా కన్నప్పలో తిన్నడి పాత్రలో మంచి విష్ణు మంచి నటన కనబరిచారు. తన గత చిత్రాలతో పోలిస్తే ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో ఆయన నటనా మరింత బాగుంది. హీరోయిన్ ప్రీతి ముకుందన్ తన పాత్రలో ఆకట్టుకుంది. చిన్న రోల్స్ అయినప్పటికీ మోహన్ బాబు, మోహన్ లాల్ కూడా ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచారు. ప్రభాస్ రుద్ర గా అలరించగా ఇతర క్యామియో పాత్రల్లో కాజల్, అక్షయ్ కుమార్, మధుబాల ల నటన కూడా ఎంతో బాగుంది.

READ  భైరవం మూవీ రివ్యూ : డీసెంట్ గా సాగె మాస్ యాక్షన్ డ్రామా 

విశ్లేషణ :

దాదాపుగా ఎన్నో ఏళ్ళ నుండి ఈ ప్రాజక్ట్ పై ఎంతో కసరత్తు చేసి ఇటీవల కన్నప్ప ని సెట్స్ మీదకు తీసుకెళ్లాడు నటుడు మంచు విష్ణు. ఇక పలువురు దిగ్గజ నటుల్ని ఇందులో పలు పాత్రలకు ఎంపిక చేసి మొత్తంగా మూవీని ఫైనల్ గా నేడు ఆడియన్స్ ముందుకి తీసుకొచ్చాడు.

అయితే ఇటువంటి మైథలాజి కథలకు స్క్రీన్ ప్లే అనేది ఆకట్టుకునేలా ఉండాలి. ఫస్ట్ హాఫ్ సాదా సీదాగా సాగే ఈ మూవీలో రొమాంటిక్, యాక్షన్ సీన్స్ పర్లేదనిపిస్తాయి. ఇంటర్వెల్ లో మోహన్ లాల్ కిరాట పాత్ర ద్వారా పరిచయం అవుతారు. విరామం అనంతరం ఆయన పాత్ర నడిచిన తీరు ఆకట్టుకుంటుంది. ఆ తరువాత పెద్ద యాక్షన్ సీన్ తో మూవీ అందరి దృష్టి మరలుస్తుంది.

ప్రభాస్ పాత్ర ఎంట్రీ ఆకట్టుకోవడంతో పాటు మోహన్ బాబు మధ్య అతడి సీన్స్ బాగున్నప్పటికీ అవి మరింత రాసుకుని ఉంటె బాగుండేది. ఆ తరువాత కన్నప్ప ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్ బాగుంటాయి, ఆ ఎపిసోడ్ బాగుండడంతో పాటు డివోషనల్ ఫీల్ తో పాటు క్లైమాక్స్ సాంగ్ కూడా అలరిస్తుంది.

READ  23 మూవీ రివ్యూ : లోపాలున్నా ఆకట్టుకునే థ్రిల్లర్

ప్లస్ పాయింట్స్ :

  • ప్రాథమిక కథాంశం
  • సెకండాఫ్ చివరి అరగంట
  • ప్రభాస్ – మోహన్ లాల్ క్యామియోలు
  • చివరి రెండు పాటలు

    మైనస్ పాయింట్స్ :

    • హెచ్చుతగ్గులు సాగె స్క్రీన్‌ప్లే
    • చాలా సాధారణమైన ఫస్ట్ హాఫ్
    • ప్రభావం చూపని యాక్షన్ సీన్స్
    • ఆకట్టుకునే డైలాగ్స్ లేకపోవడం

    తీర్పు :

    మొత్తంగా అందరిలో మంచి అంచనాలతో రిలీజ్ అయిన మంచు విష్ణు కన్నప్ప మూవీ చివరి 30 నిముషాలు మాత్రం ఎంతో అలరిస్తుంది. అయితే ఇందులో మ్యూజిక్, ప్రభాస్, మోహన్ లాల్ ల ప్రత్యేక పాత్రలు, మంచు విష్ణు అలరించే నటన వంటి ప్లస్ పాయింట్స్ గా చెప్పవచ్చు. అయితే స్క్రీన్ ప్లే లో హెచ్చుతగ్గులు, సాదా సీదాగా సాగె ఫస్ట్ హాఫ్ మైనస్ లు. మొత్తంగా కన్నప్ప మూవీ యావరేజ్ గా సాగె డివోషనల్ డ్రామా అని చెప్పాలి.

    Follow on Google News Follow on Whatsapp


    - Advertisement -
    RELATED ARTICLES

    Trending Stories

    Recent Stories