Homeసినిమా వార్తలువారిసు వివాదం వెనక ఉంది దిల్ రాజు మాఫియా నా లేక హీరో విజయ్ మాఫియా...

వారిసు వివాదం వెనక ఉంది దిల్ రాజు మాఫియా నా లేక హీరో విజయ్ మాఫియా నా?

- Advertisement -

ఎప్పుడైతే దిల్ రాజు ‘ వారిసు’ సినిమాకి థియేటర్లు ఎక్కువ థియేటర్లు కేటాయించే ప్రయత్నం మొదలు పెట్టారో అప్పటి నుంచి టాలీవుడ్‌లో వివాదాలు మొదలయ్యాయి. ఇక ఈ వివాదం శృతి మించుతోంది, అంతే కాక సమస్య సరిహద్దులు దాటింది మరియు ఇదే అవకాశంగా తీసుకుని తమిళ నిర్మాతలు రెండు పరిశ్రమల మధ్య గ్యాప్‌ను పెంచడానికి పాలుపంచుకుంటున్నారు.

డబ్బింగ్ చిత్రాలకు ద్వితీయ ప్రాధాన్యత మాత్రమే ఇవ్వాలని 2019 సంక్రాంతి సందర్భంగా దిల్ రాజు ప్రకటనలు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ రానున్న సంక్రాంతికి మాత్రం రెండు తెలుగు చిత్రాలను పణంగా పెట్టి నాణ్యమైన థియేటర్‌లను తమిళ సినిమాకు ఇవ్వడంతో నెటిజన్లు మరియు తెలుగు నిర్మాతల సంస్థలు ఈ విషయం పై ఫిర్యాదు చేశాయి.

పైకి దిల్ రాజు మౌనం పాటిస్తున్నారు కానీ తన ప్రయోజనాలను ముందుకు తీసుకురావడానికి తెర వెనుక సరైన తీగలను లాగుతున్నారు. ఇక ఈ విషయం మీద మాట్లాడుతూ.. ప్యాన్ ఇండియా యుగంలో ఇక పై డబ్బింగ్ చిత్రాలను నియంత్రించలేమని అల్లు అరవింద్ దిల్ రాజును సమర్థించారు. ఇదో రకంగా మాఫియాగా మారుతోంది.

READ  విజయ్ వారిసులో కేవలం 1/3 వంతుకు అమ్ముడయిన అజిత్ తునివు ఓవర్సీస్ హక్కులు

వారి ప్రయోజనాన్ని బట్టి, ఎక్కువ థియేటర్లను పొందడానికి వారు ఇష్టం వచ్చినట్లు నియమాలని మార్చేయడం అలవాటుగా చేసుకున్నారు. 2019 సంక్రాంతికి పెట్టా సినిమాని చిన్న నిర్మాత అయినప్పుడు విజయ్ కంటే రజనీకాంత్‌కే ఎక్కువ మార్కెట్ ఉన్నా థియేటర్లు సరిపడా ఇవ్వలేదు. ఇది భాష లేదా రాష్ట్రం గూర్చిన విషయం కాదు, అధికారమే ముఖ్యంగా ఇక్కడ కనబడుతోంది.

దిల్ రాజు, అల్లు అరవింద్ లాంటి నిర్మాత ప్రభావం ఉంటే ఎలాగైనా థియేటర్లు దక్కించుకోవచ్చు. అదే సమయంలో చిన్న నిర్మాతలు మాత్రం కష్టపడుతున్నారు, అదీ కాకుండా ఈ సమస్యకు భాష రంగు అంటించి తప్పుదారి పట్టిస్తున్నారు.

ఇదిలా ఉంటే తమిళ నిర్మాతలు తమ సినిమాలకు ఇంతవరకు థియేటర్లు దొరకలేదంటూ అతిగా స్పందిస్తున్నారు. తమిళ సినిమాల ఆదాయంలో 20% తెలుగు రాష్ట్రాల నుంచే వస్తున్నట్లు సమాచారం. రాజమౌళి సినిమాలు తప్ప తెలుగు సినిమాలు తమిళ నాట పెద్దగా వసూళ్లు చేయలేదు.

ప్యాన్ ఇండియా సంస్కృతి కేవలం ఇటీవల మాత్రమే ప్రారంభం అయింది. థియేటర్ల నియంత్రణ పై వారు ఫిర్యాదు చేయడం సిల్లీగా ఉంది. వారు పెట్టా వివాదం సమయంలో గొంతు పెంచి ఉండాల్సింది, పెట్టా తెలుగు డిస్ట్రిబ్యూటర్ ఆందోళన చేస్తున్నప్పుడు మాత్రం మౌనంగా ఉండిపోయారు కానీ దిల్ రాజు వారిసు సినిమాకు కావాల్సిన దానికంటే ఎక్కువ థియేటర్లు కేటాయిస్తున్నప్పుడు మాత్రం అనవసరంగా పరుష స్వరంతో బెదిరిస్తున్నారు.

READ  భారీ ధరకు అమ్ముడయిన కాంతార తెలుగు శాటిలైట్ హక్కులు

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories