Homeసినిమా వార్తలు​ Intresting Update on Baahubali 3 'బాహుబలి 3' మూవీ పై ఇంట్రెస్టింగ్ అప్...

​ Intresting Update on Baahubali 3 ‘బాహుబలి 3’ మూవీ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

- Advertisement -

​మన టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దిగ్గజ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో తరకెక్కిన రెండు పాన్ ఇండియన్ భారీ సినిమాలు బాహుబలి 1 బాహుబలి 2 రెండూ కూడా ఎంతటి భారీ విజయాలు అందుకున్నాయో మనందరికీ తెలిసిందే. ఇక వీటి అనంతరం బాహుబలి 3 మూవీ ఉంటుందా అనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. 

అయితే ఆ తర్వాత ఆ సినిమాకు సంబంధించి ఒక లైన్ పై టీం వర్క్ చేస్తోందని కూడా సమాచారం వచ్చింది. ఇక తాజాగా కంగువ ప్రొడ్యూసర్ అయిన కేఈ జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ఇటీవల బాహుబలి 3 గురించి విజయేంద్రప్రసాద్ గారిని రాజమౌళి గారిని సంప్రదిస్తే దానికి సంబంధించి ఒక లైన్ పై వర్క్ చేస్తున్నామని రాబోయే రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారన్నారు. 

ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో ఆయన SSMB 29 మూవీ చేస్తుండడంతో ఆ తర్వాత బాహుబలి 3 ఉంటుందనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తంగా అయితే బాహుబలి 3 పక్కాగా ఉంటుందని దీన్ని బట్టి అర్థమవుతుంది. గతంలో కూడా ఒకానొక సందర్భంలో రాజమౌళి మాట్లాడుతూ పక్కాగా బాహుబలి 3 ఎప్పుడు ఉంటుంది అని చెప్పలేను గాని దానికి సంబంధించి ఒక లైన్ పై తమకు ఆలోచన ఉంది అనే విషయాన్ని ఆయన ప్రస్తావించిన విషయం తెలిసిందే. మరి బాహుబలి 3 మూవీ పక్కాగా ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. 

READ  Thandel on Game Changer Release Date 'గేమ్ ఛేంజర్' రిలీజ్ డేట్ కి 'తండేల్' ?

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories