పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ ద్వయం దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ హిస్టారికల్ పాన్ ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ హరిహర వీరమల్లు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గజదొంగ వీరమల్లు అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తుండగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ సీనియర్ నిర్మాత ఏఎం రత్నం దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు.
ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై పవన్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ అందరిలో కూడా విశేషమైన అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన మూడు గ్లింప్స్ టీజర్లు, పోస్టర్లతో పాటు రెండు సాంగ్స్ బాగానే రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. మే 9న హరిహర వీరమల్లు గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే విషయం ఏమిటంటే ఈ సినిమాలో పలు కీలక సన్నివేశాలు ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ అందరిని అలరిస్తాయి అంటున్నారు.
పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ తో పాటు ఇంటర్వెల్, ఫ్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ గూస్ బంప్స్ రేంజ్ లో ఉండటంతో పాటు పార్ట్2 పై కూడా ఇవి అంచనాలు మరింతగా పెంచేస్తాయని చెప్తున్నారు. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ పెర్ఫామెన్స్ తో పాటు క్రిష్ మరియు జ్యోతి కృష్ణ ల టేకింగ్ అలానే కీరవాణి సంగీతం, బ్యాక్ గ్రాండ్ స్కోర్, గ్రాండియర్ విజువల్స్ ఈ సినిమాని భారీ సక్సెస్ చేస్తాయని హరి హర వీరమల్లు టీం ఆశాభావం వ్యక్తం చేస్తుంది.