మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన “మేజర్” లు చక్కని ప్రశంసలతో పాటు కలెక్షన్స్ కూడా వచ్చాయి అడివి శేష్ కెరీర్ లో ఎప్పుడు చూడని ఓపెనింగ్స్ మరియు కలెక్షన్స్ వచ్చాయి “మేజర్” కి.
మంచి ఉద్దేశ్యంతో తీసిన సినిమాకి ఇలా లాభసాటి వ్యాపారం జరగడం వల్ల ఇలాంటి సినిమా తీసే వాళ్ళకి మరింత వెసులుబాటు కలిగించినట్టు అవుతుంది అయితే తెలుగుతో పాటు హిందీలోనూ “మేజర్” ను విడుదల చేసారు. వారం ముందుగానే ప్రీమియర్ లు అంటూ చేసిన ప్రచారం వల్ల రివ్యూస్ పరంగా బాగానే గిట్టుబాటు అయినా కలెక్షన్ లు అనుకున్న స్థాయిలో రాలేదు హిందీలో.
నార్త్ లో 10 కోట్ల గ్రాస్ అనేది చిన్న విషయం కాకపోయినా ఈ చిత్రానికి నిర్మాత అయిన సూపర్స్టార్ మహేష్, పబ్లిసిటి మీద మరింత శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది అని పలు వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
మహేష్ లాంటి పెద్ద హీరో తను నిర్మాతగా వ్యవహరించిన సినిమాకి సరైన మోతాదులో పబ్లిసిటీ చేయకుండా టూర్ కి వెళ్లిపోవడం వల్ల సినిమాకి రావాల్సినంత బజ్ రాలేదు అనే మాటలో నిజం లేకపోలేదు