Homeసినిమా వార్తలు​Court Movie made Nani's Judgment True నాని జడ్జిమెంట్ నిజం చేసిన 'కోర్ట్' మూవీ

​Court Movie made Nani’s Judgment True నాని జడ్జిమెంట్ నిజం చేసిన ‘కోర్ట్’ మూవీ

- Advertisement -

​ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్ పాత్రల్లో అలానే హర్ష రోషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ కోర్ట్ యాక్షన్ డ్రామా మూవీ కోర్ట్. నాచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వ్యవహరించిన ఈ మూవీని రామ్ జగదీశ్ తెరకెక్కించారు. ఇటీవల ప్రచార చిత్రాలతో మంచి ఆసక్తిని ఏర్పరిచిన ఈ మూవీ యొక్క ప్రత్యేక ప్రీమియర్స్ ని నిన్న కొందరు మీడియా పర్సన్స్ కి ప్రదర్శించారు. 

అయితే వారి నుండి మూవీకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే లభించింది. నిజానికి కోర్ట్ యాక్షన్ మూవీస్ పెద్దగా ఆకట్టుకోవు, అలానే ఎక్కడైనా కథ, కథనాలు దారితప్పితే సినిమా పని అంతే సంగతులు. కానీ ఈ కోర్ట్ సినిమాని మాత్రం దర్శకుడు రామ్ జగదీశ్ ఎంతో చక్కగా తెరకెక్కించారు. 

ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ చాలా రేసీగా సాగడంతో పాటు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అంశాలు ఆకట్టుకుంటాయి. నేటి సమాజంలోని పోక్సో యాక్ట్ ఆధారంగా సాగిన ఈ సినిమా యొక్క పెయిడ్ ప్రీమియర్స్ నేడు ప్రదర్శితం కానుండగా రేపు ఈమూవీ థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి రానుంది. 

READ  Jrntr Dragon Movie Shooting starts Tomorrow సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్దమైన ఎన్టీఆర్ 'డ్రాగన్' మూవీ

మొత్తంగా కోర్ట్ మూవీ పెద్ద విజయం అందుకుంటుందని ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ చెప్పిన నాని యొక్క జడ్జిమెంట్ నిజం అయింది. మరి రేపటి నుండి ఈ మూవీ ఎంతమేర ఆడియన్స్ ని మెప్పించి ఏ స్థాయి కలెక్షన్ సొంతం చేసుకుంటుందో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories