HomeMovie Newsమెగాస్టార్ - అనిల్ మూవీ లేటెస్ట్ అప్ డేట్ 

మెగాస్టార్ – అనిల్ మూవీ లేటెస్ట్ అప్ డేట్ 

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం విశ్వంభర మూవీతో పాటు అనిల్ రావిపూడితో మరొక మూవీ కూడా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు మూవీస్ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. వీటిలో విశ్వంభర మూవీ చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. ఈ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ మూవీని మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తుండగా త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.

దీని త్వరలోనే ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇక అనిల్ రావిపూడి మూవీ విషయానికి వస్తే నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మెగాస్టార్ కుమార్తె సుస్మితతో పాటు సాహు గారపాటి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

భీమ్స్ సిసిలోరియో సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ ని జరుపుకోగా నేటి నుండి యూనిట్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగే సినిమాలోని ఒక భాగాన్ని చిత్రీకరించడానికి డెహ్రాడూన్‌కు వెళ్లనున్నారు.

ఇప్పటికే దానికి సంబంధించి ప్రొడక్షన్ టీమ్ ఏర్పాట్లు చేసింది. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు మెగాస్టార్ మార్క్ యాక్షన్ అంశాలు కూడా ఈ మూవీలో ఉంటాయట. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది.

See also  హిట్ 3 : రూ. 100 కోట్ల దిశగా కొనసాగుతున్న కలెక్షన్ 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories