HomeMovie News'అఖండ - 2' టీజర్ తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ 

‘అఖండ – 2’ టీజర్ తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ 

- Advertisement -

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తాజాగా బోయపాటి శ్రీను తీస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ అఖండ 2. ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం సొంతం చేసుకున్న అఖండ కి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది.

సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ సంస్థ పై రామ్ ఆచంట, గోపి ఆచంట గ్రాండ్ గా నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

వాస్తవానికి సెప్టెంబర్ 25న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ మరికొన్నాళ్లు వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. అయితే విషయం ఏమిటంటే, జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేయనున్న మేకర్స్, అందులోనే న్యూ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయనున్నారట.

కాగా అఖండ 2 మూవీ డిసెంబర్ మొదటి వారంలో గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుందని తెలుస్తోంది. ముఖ్యంగా పార్ట్ 1 ని మించేలా ఇందులో బాలకృష్ణ పోషించిన అఘోర పాత్ర యొక్క సీన్స్ మరింత అద్భుతంగా ఉండనున్నట్లు టాక్.

See also  'థగ్ లైఫ్' ఓవర్సీస్ బ్రేకీవెన్ 18 మిలియన్ డాలర్స్

అలానే థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు సాంగ్స్ విషయంలో కూడా దర్శకుడు బోయపాటి ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారట. మరి రిలీజ్ అనంతరం అఖండ 2 ఎంత మేర సక్సెస్ అవుతుందో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories