Homeసినిమా వార్తలు'అఖండ - 2' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

‘అఖండ – 2’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియన్ మూవీ అఖండ 2. ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ సంస్థ పై రామ్ ఆచంట, గోపి ఆచంట గ్రాండ్ గా నిర్మిస్తుండగా రాక్ స్టార్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

మూడున్నరేళ్ల క్రితం రిలీజ్ అయి పెద్ద విజయం అందుకున్న అఖండ కి సీక్వెల్ అయిన ఈ మూవీపై నందమూరి ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ వాస్తవానికి సెప్టెంబర్ 25న రిలీజ్ కావాల్సి ఉంది.

అయితే తాజాగా అదే డేట్ కి పవన్ కళ్యాణ్ ఓజి మూవీ రిలీజ్ కానున్నట్లు ఆ మూవీ టీమ్ ప్రకటించడంతో అఖండ 2 వాయిదా అంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం 6 గం. 03 ని. లకు తమ మూవీ యొక్క టీజర్ రిలీజ్ చేయనున్నట్లు అఖండ 2 టీమ్ కొద్దిసేపటి క్రితం ఒక పోస్టర్ రిలీజ్ చేసింది.

READ  వరుస అవకాశాలతో నటి 'కయదు లోహర్'

తమ మూవీ రిలీజ్ డేట్ ని టీమ్ వాయిదా వేసే అవకాశం లేదని పోస్టర్ లో ప్రకటించింది. కాగా అఖండ 2 టీజర్ అదిరిపోయిందని టాలీవుడ్ టాక్. మరి రిలీజ్ అనంతరం అఖండ 2 ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories