ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా అఖండ 2. మూడున్నరేళ్ల క్రితం రిలీజై పెద్ద విజయం అందుకున్న అఖండ కి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.
వాస్తవానికి ఈ సినిమాని సెప్టెంబర్ 25 ని రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవల ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసిన టైం లో మేకర్స్ అయితే డేట్ ప్రకటించారు. ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజీత్ ల కాంబినేషన్లో రూపొందుతోన్న ఓజి మూవీ అదే రోజున రిలీజ్ అనౌన్స్ మెంట్ వచ్చింది.
దానితో అఖండ 2 సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడనున్నట్లు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం వచ్చిందట. ఇక అఖండ 2 మూవీ డిసెంబర్ వాయిదా పడే అవకాశం ఉందని తాజాగా వార్తలు కూడా వచ్చాయి. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని డిసెంబర్ 25న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్దమైనట్లు చెప్తున్నారు.
త్వరలో దీనికి సంబంధించి మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందట. దీనికి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా బాలకృష్ణ అఘోర పాత్ర ఈ సినిమాలో ప్రధాన హైలైట్ గా ఉంటుందని బోయపాటి మార్కు యాక్షన్స్ అంశాలు పార్ట్ వన్ ని మించేలా దీనిలో అత్యద్భుతంగా ఉంటాయని టాక్. మరి మొత్తమా నాలుగోసారి బాలకృష్ణ, బోయపాటి ల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 రిలీజ్ అఞ్ఞతరం ఎంత మేర విజయం అందుకుంటుందో చూడాలి.