Homeసినిమా వార్తలు'హిట్ - 3' : అసలు పరీక్ష ఇప్పుడే మొదలు

‘హిట్ – 3’ : అసలు పరీక్ష ఇప్పుడే మొదలు

- Advertisement -

తాజాగా న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హిట్ 3. ఈ సినిమా రిలీజ్ అనంతరం భారీ విజయవంతం అయింది.

క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో అర్జున్ సర్కార్ పాత్రలో నాని అద్భుత నటన అందర్నీ ఎంతో ఆకట్టుకుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ విలన్ గా కనిపించారు.

ఓవరాల్ గా యాక్షన్ సన్నివేశాలతో థ్రిల్లింగ్ అంశాలతో అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమా తాజాగా ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా పలు భాషల ఆడియన్స్ ముందుకు వచ్చింది.

అయితే హిట్ 3 అనంతరం త్వరలో హిట్ 4 సినిమా ప్రారంభం కానుంది. ఇందులో తమిళ నటుడు కార్తీ హీరోగా నటించనున్నారు. అసలు విషయం ఏమిటంటే తాజాగా ఓటీటిలోకి వచ్చిన హిట్ 3 మూవీ అటు తమిళ ఆడియన్స్ ని కూడా ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

ఇది వారిని కూడా ఆకట్టుకుంటే రానున్న హిట్ 4 మూవీ అక్కడ కూడా మంచి మార్కెట్ అందుకునేటువంటి అవకాశం ఉంది. మరి ఎంత మేర హిట్ 3 మూవీ నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతుందో చూడాలి. 

READ  'సత్యం సుందరం' డైరెక్టర్ కి స్పెసిల్ గిఫ్ట్ ఇచ్చిన సూర్య, కార్తీ 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories