HomeMovie News'కన్నప్ప' కి ప్లస్ కానున్న ప్రభాస్ క్రేజ్

‘కన్నప్ప’ కి ప్లస్ కానున్న ప్రభాస్ క్రేజ్

- Advertisement -

మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా కన్నప్ప. ఈ మూవీలో ప్రభాస్ తో పాటు మోహన్ లాల్, కాజల్, అక్షయ్ కుమార్ వంటి నటులు ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇప్పటికే ప్రమోషన్స్ పరంగా సాంగ్స్, టీజర్ తో అందరిని ఆకట్టుకున్న కన్నప్ప నుంచి జూన్ 13న థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయడానికి రెడీ అయింది టీమ్. అయితే విషయం ఏమిటంటే ఈ మూవీకి సంబంధించి ప్రభాస్ క్రేజ్ మూవీ యొక్క ప్రమోషన్స్ కి ఎంతో హెల్ప్ అయ్యేలా ఉంది.

ముఖ్యంగా ఈ సినిమాని నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర ఏరియాస్ లో మైత్రి మూవీస్ వారు మంచి ధరకు కొనుగోలు చేసి డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. కాగా ఈ మూవీ ఆ ప్రాంతాల్లో అడ్వాన్స్ బేసిస్ లో రిలీజ్ కానుంది. ఓవరాల్ గా చూసుకుంటే కన్నప్ప బిజినెస్ పరంగా ప్రభాస్ ఫ్యాక్టర్ బాగానే పనిచేస్తుంది.

మరోవైపు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అనంతరం సినిమాపై అంచనాలు భారీగా పెరగటం ఖాయమని తప్పకుండా త మూవీ అందర్నీ ఆకట్టుకుంటుందని తాజాగా ప్రమోషన్ ఈవెంట్స్ లో భాగంగా హీరో మంచు విష్ణు తెలిపారు. జూన్ 27న కన్నప్ప పలు భాషల ప్రేక్షకుల ముందుకు రానుంది.

See also  మెగాస్టార్ కి జోడీగా నయనతార ఫిక్స్ 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories