HomeMovie Newsనెట్ ఫ్లిక్స్ లో 'రెట్రో' ని బీట్ చేసిన 'హిట్ 3'

నెట్ ఫ్లిక్స్ లో ‘రెట్రో’ ని బీట్ చేసిన ‘హిట్ 3’

- Advertisement -

నాచురల్ స్టార్ నాని హీరోగా డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ హిట్ 3. కాగా గతంలో వచ్చిన హిట్ ఫ్రాంచైజ్ లోని రెండు సినిమాల కంటే ఇది బాగా సక్సెస్ అయి ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ సొంతం చేసుకుంది.

శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీలోని కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చిన హిట్ 3 మూవీ థియేటర్స్ రిలీజ్ అనంతరం తాజాగా ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది. అయితే ఇటీవల సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ తీసిన రెట్రో కూడా అదే రోజు ఓటిటిలోకి రాగా ప్రస్తుతం హిట్ 3 దానిని మించి మరింత మంచి రెస్పాన్స్ తో కొనసాగుతోంది.

కాగా హిట్ 3 నెట్ ఫ్లిక్స్ లో టాప్ లో ట్రెండ్ అవుతుండగా రెట్రో రెండవ స్థానంలో ఉంది. అటు రెట్రో కి కూడా బాగానే రెస్పాన్స్ వస్తున్నప్పటికీ ఓటిటి లో హిట్ 3 డామినేషన్ కనపడుతోందని అంటున్నారు విశ్లేషకులు. అటు బాక్సాఫీస్ పరంగా కూడా రెట్రో ఆశించిన స్థాయి సక్సెస్ అందుకోలేకపోయిన విషయం తెలిసిందే. 

Follow on Google News Follow on Whatsapp

See also  విశాల్ - సాయి ధన్సిక మ్యారేజ్ డేట్ ఫిక్స్ 


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories